Thu Dec 19 2024 12:53:25 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఊహలు వారివి.. ఎవరి ఆలోచన వాళ్లది అంటూ కామెంట్స చేశారు. తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారన్నారు. ఆయన ఆలోచన ఆ విధంగా ఉందని, కానీ తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ పోటీలో లేదని వారనుకుంటే సరిపోతుందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మంచి అవకాశమిచ్చిన...
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశమిచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో పదవి ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా పార్టీని వీడేటప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని లక్ష్మణ్ అన్నారు. కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.
Next Story