Wed Jan 08 2025 06:03:07 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సర్కార్ కు కిషన్ రెడ్డి వార్నింగ్
పేద ప్రజలకు అండగా బీజేపీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
పేద ప్రజలకు అండగా బీజేపీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ నది పేరుతో కూలుస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పేదలు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణ చేయడం తప్పు కాదని, ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం తాము వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.
పేదలకు అండగా...
అలాగే పేదలకు అండగా ఉండేందుకు బీజేపీ అన్ని రకాల పోరాటాలకు దిగుతుందని తెలిపారు. రానున్న కాలంలో ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని తెలిపారు. బీజేపీ నేతలు అందరూ సమిష్టిగానే ఈ పేదల ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే మంచిదని సూచించారు. పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ నదిని శుభ్రపరిచే కార్యక్రమం చేపడితే తాము కూడా చేయూతనిస్తామని కిషన్ రెడ్డి తెిపారు.
Next Story