Mon Dec 23 2024 13:11:35 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం
రేపటి నుంచి ఐదు కస్టర్లలో బస్సుయాత్రలను తమ పార్టీ ప్రారంభిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
రేపటి నుంచి ఐదు కస్టర్లలో బస్సుయాత్రలను తమ పార్టీ ప్రారంభిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర పోస్టర్ ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ బస్సు యాత్రలు ఉంటాయని తెలిపారు. యాత్రల్లో సభలతో పాటు ప్రత్యేక కార్యక్రమలు ఉంటాయని అన్నారు. బాసర నుంచి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాసశర్మతాండులూరు కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, యాదాద్రి యాత్రను గోవా ముఖ్యమంత్రి పరమాదో సావంత్, మక్తల్ లో యాత్రను మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాలు ప్రారంభిస్తామని చెప్పారు.
రేపటి నుంచే యాత్రలు...
రేుపటి నుంచి యాత్రలను ప్రారంభించి వచ్చే నెల 2వ తేదీ లోపు యాత్రను పూర్తి చేస్తామని తెలిపారు. రేపు నాలుగు యాత్రలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. నిజాయితీ పాలనను అందిస్తున్నది మోడీ మాత్రమేనన్న కిషన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ రాకముందే యాత్రను ముగిస్తామని ఆయన తెలిపారు. మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించే లక్ష్యంగానే తమ యాత్రలు చేయనున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Next Story