Thu Dec 19 2024 05:08:52 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తే ఎలా?
నిర్మాణాలను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తామంటే కుదరదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
నిర్మాణాలను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తామంటే కుదరదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఎందుకు అనుమతులు ఇచ్చాయని అన్నారు. అక్రమ నిర్మాణాలయితే వాటికి విద్యుత్తు కనెక్షన్, నీటి కనెక్షన్ ఇచ్చింది అధికారులు కాదా? అని ప్రశ్నించారు. ముందు అనధికారికంగా అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
హైడ్రా పేరిట హైడ్రామా...
తెలంగాణలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తుందన్న కిషన్ రెడ్డి గతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేయడం విడ్డూరంగా ఉందన్నారు. అటువంటి నిర్మాణాలకు రోడ్లను కూడా నిర్మించారని తెలిపారు. ఏ చర్యలైనా, చట్టాన్నైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని తెలిపారు.
Next Story