Wed Nov 20 2024 15:17:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేలు కొనుగోలుకు బ్రోకర్లు ఎందుకు?
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తమకు బ్రోకర్ల అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తమకు బ్రోకర్ల అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాము బరిగీసి ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటామని తెలిపారు. తమకు సన్యాసులు, స్వామీజీలతో పనిలేదన్నారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రోకర్లను పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడా? అని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలన్నారు. నిన్నటి సినిమా చూస్తే అందులో బీజేపీ ప్రస్తావనే లేదన్నారు. రోహిత్ రెడ్డితోనే ప్రభుత్వం కూలిపోతుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ సినిమా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు.
పాత రికార్డులనే...
పాత రికార్డులనే కేసీఆర్ తిరగేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదన్నారు. ఏరోజైనా ప్రజాప్రతినిధులను కలిశారా? అని ఆయన ప్రశ్నించారు. నిన్న చూపించిన వీడియోలో ఏముందో మాకైతే అర్థం కాలేదన్నారు. నెలలో 15 రోజులు ఫాంహౌస్ లో ఉండేవాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? తనకు తెలియకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటారా? అని నిలదీశారు. తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలన్నది తమ అభిమతమని అన్నారు.
ఎన్నికల కోసమే...
తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనే కోరికతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నలుగురు ఆర్టిస్టులు కూర్చుని మీడియా ముందు పెడితే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. అమిత్ షాతో ఫొటో ఉన్నంత మాత్రాన అది నిజమవుతుందా? అని అన్నారు. బయట వ్యక్తుల ద్వారా బేరసారాలు జరపాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. ఆ వీడియోలో బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.
- Tags
- kishan reddy
- kcr
Next Story