Tue Dec 17 2024 04:48:56 GMT+0000 (Coordinated Universal Time)
kishan Reddy : రైతుల కోసం కిషన్ రెడ్డి దీక్ష
రైతుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు
రైతుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. ఒకరోజు దీక్షతో అయినా ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతూ కాంగ్రెస్ నిలువునా ముంచిందన్నారు. వెన్నుపోటు పొడవటం కాంగ్రెస్ కు అలవాటుగా మారిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు.
రుణమాఫీ ఎక్కడ?
రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు కొనుగోలు చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. రెండు లక్షల రుణమాఫీ విషయాన్నే కాంగ్రెస్ నేతలు మర్చిపోయినట్లు నటిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలోనే రైతులకు అన్ని రకాలుగా గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఈసారి బీజేపీ నాలుగు వందల స్థానాలకు పైగానే గెలుచుకుంటుందని తెలిపారు.
Next Story