Thu Dec 19 2024 05:14:55 GMT+0000 (Coordinated Universal Time)
రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ వంతెన నిర్మాణానికి వచ్చే నెల టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు.
సెప్టంబరు నెలాఖరులోగా...
సెప్టంబరు నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాకు తెలిపారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య దూరం మరింత తగ్గుతుంది. దీనిని సోమశిల వద్ద నిర్మించనున్నారు. కేబుల్ ఐకానిక్ బ్రిడ్జి రెండు తెలంగాణ రాష్ట్రాలకు ఒక వరంగా మారనుంది.
Next Story