Mon Dec 23 2024 13:45:55 GMT+0000 (Coordinated Universal Time)
మెగా కోడలు ఉపాసన ఇంట విషాదం
ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె చివరి క్షణం వరకూ ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన నానమ్మతో తనకున్న మెమొరీస్ ను గుర్తు చేసుకుంటూ.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె చివరి క్షణం వరకూ ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారని తెలిపింది. "ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. నన్ను పెంచి పెద్ద చేసింది నానమ్మే. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను."
"నేను మా గ్రాండ్ పేరెంట్స్ నుండి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ ప్రేమను, అనుభూతుల్ని నా పిల్లలకూ అందేలా చూస్తానని మాట ఇస్తున్నాను నానమ్మ. నీ ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కాగా.. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఉపాసన.. ఆమె నానమ్మను కోల్పోవడం నిజంగా తీరని లోటు అని, బాధ పడకు.. నువ్వు కూడా గొప్ప తల్లివి అవుతావు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Next Story