Mon Dec 23 2024 02:01:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉపేంద్రనాథ్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
మోసాలు వెలుగు చూడటంతో తెలంగాణ ప్రభుత్వం మల్టీలెవల్ మార్కెటింగ్‌పై నిషేధం విధించింది. కర్ణాటకకు చెందిన రాజేష్‌ఖన్నా
హైదరాబాద్ కేంద్రంగా మల్టీ లెవల్ మార్కెటింగ్ అంటూ మోసాలకు పాల్పడిన క్యూనెట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సీహెచ్.ఉపేంద్రనాథ్రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీసీఎస్ డీసీపీ కె.శిల్పవల్లి మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని కాల్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలవడంతో క్యూ నెట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం సంస్థను మూసేసినా మళ్లీ మరో పేరుతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో గత మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఉపేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం అక్కడ అదుపులోకి తీసుకుని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు వారెంట్‌పై హైదరాబాద్ కు తరలించారు.
2017లోనే క్యూ నెట్ మోసాలు వెలుగు చూడటంతో తెలంగాణ ప్రభుత్వం మల్టీలెవల్ మార్కెటింగ్‌పై నిషేధం విధించింది. కర్ణాటకకు చెందిన రాజేష్‌ఖన్నా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చెన్నమ్మపల్లి గ్రామానికి చెందిన ఉపేంద్రనాథ్‌రెడ్డి మరికొందరితో కలసి క్యూనెట్ సంస్థ పేరును మార్చి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట వ్యాపారం ప్రారంభించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ కార్యాలయం ప్రారంభించారు. ఈ-కామర్స్ వ్యాపారంలో పెట్టుబడితో ప్రతినెలా వేల రుపాయలు ఆదాయం సంపాదించ వచ్చంటూ నిరుద్యోగ నమ్మించారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50,000 నుంచి 1,50,000 వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు ఇలా వసూలు చేశారు. డబ్బు వసూలు చేసిన తర్వాత అసలు, లాభాలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. కొత్తగా సభ్యులను చేర్పిస్తే డబ్బు తిరిగి ఇస్తామంటూ మెలికపెట్టి వారిలో కొందరిని ఉద్యోగులుగా మార్చుకున్నారు. గతంలో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడి ఉండటంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. రాజేష్‌ఖన్నా, ఉపేంద్రనాథ్‌రెడ్డి సహా మరో 15 మంది నిందితులను గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి, 35 బ్యాంకు ఖాతాల్లో రూ.54కోట్లు సీజ్ చేశారు.
Next Story