Mon Dec 23 2024 16:12:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మేడిగడ్డ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణ
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా తీసుకుందని తెలిపారు. మేడిగడ్డను ఇప్పటికే పరిశీలించిన రాష్ట్ర మంత్రులు ఆ తర్వాత దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు.
సిట్టింగ్ న్యాయమూర్తి చేత...
మేడిగడ్డ లో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసింది. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కి ప్రభుత్వం లేఖ రాసింది. అసలు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయి? ఇందుకు బాధ్యులెవరు? అందుకు కారణాలేంటి? అన్న దానిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని నిర్ణయించింది.
Next Story