Mon Dec 23 2024 11:57:15 GMT+0000 (Coordinated Universal Time)
Uttam CM: ఉత్తమ్ ముఖ్యమంత్రి అవుతారు.. నాలుక ఎఫెక్ట్ అంటున్నారే!!
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారన్నారు. మున్ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందన్నారు.
నాలుక ఎఫెక్ట్:
తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను ఏదైనా అంటే నిజమవుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి మిస్ అయిందని, ఆయన భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతారని అన్నారు. ఆగస్టు 30న భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించారు.

Next Story