Mon Dec 23 2024 15:47:25 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సచివాలయంలో వాస్తు మార్పులు
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేపట్టారు.
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతున్న సందర్భంగా సచివాలయంలో కొద్దిగా వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వాస్తుకు సంబంధించి మార్పుల పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం సచివాలయాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించింది. అయితే సచివాలయం నిర్మించి తర్వాత వెంటనే అధికారానికి దూరమయింది. దీంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తు మార్పులతో పాలన సాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
తూర్పు వైపు ఉన్న...
తెలంగాణ సచివాలయం తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈశాన్యం గేటుకు తూర్పున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో గేటును ఏర్పాటు చేయనున్నారని అధికారులు తెలిపారు. అయితే మిగిలిన ద్వారాలను మాత్రం యధాతథంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. అధికారంలో ఉండటమే కాకుండా, పరిపాలన సవ్యంగా, సాఫీగా సాగాలంటే స్వల్ప మార్పులు చేయాలని పలువురు పండితులు చేసిన సూచనల మేరకు ఈ స్వల్ప మార్పులు చేస్తున్నారు.
Next Story