Sun Dec 22 2024 22:57:15 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పై తీర్పు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు రానుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు రానుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అరెస్ట్ పై కవిత వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తీర్పు వెలువడనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయగా, తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను అదే కేసులో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది.
సీబీఐ అరెస్ట్ పై...
సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన తీహార్ జైలులో ఉన్న కవితను అరెస్ట్ చేసి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది. దీనిపై కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ వేశారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించడమే కాకుండా ఆధారాలను తారుమారు చేస్తారని సీబీఐ తరుపున న్యాయవాదులు వాదించారు. ఈరోజు సీబీఐ కేసులో కవిత అరెస్ట్ పై ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈడీ కేసులో కూడా కవిత బెయిల్ పిటీషన్ విచారణ జరిపింది. దీనిపై కూడా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Next Story