Tue Dec 24 2024 02:31:16 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల సస్సెన్షన్ పై నేడు హైకోర్టు తీర్పు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు రానుంది.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు రానుంది. ఇప్పటికే దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసి పెట్టింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన తొలిరోజే బీజేపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
తీర్పు రిజర్వ్ చేసి...
దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను పాటించకుండా తమ ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. తమ సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరారు. దీనిపై ఇరువర్గాల వాదన విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన హైకోర్టు సిబ్బందిని అసెంబ్లీలోకి అనుమతించలేదు.
Next Story