Fri Dec 20 2024 10:59:55 GMT+0000 (Coordinated Universal Time)
Chevella: చేవేళ్ల పోలీసుల వీడియో వైరల్.. ఇలా కొట్టారేంటి!!
తెలంగాణలోని చేవెళ్ల వద్ద బహిరంగంగా ఇద్దరు వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసు అధికారి
తెలంగాణలోని చేవెళ్ల వద్ద బహిరంగంగా ఇద్దరు వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసు అధికారి, కానిస్టేబుల్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ లాక్కుని వస్తూ ఉండగా.. అధికారి వెనుక నుండి తన్నడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఇష్టానుసారం తిట్టడం.. కొట్టడం చూడొచ్చు. ఇక అక్కడ వీడియోలు తీస్తున్న వ్యక్తులను కూడా కానిస్టేబుల్ కొట్టడం వీడియోలో రికార్డు అయింది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో అని పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది.
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారిని చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశంగా గుర్తించారు.. కానిస్టేబుల్ పేరు శ్రీను, అక్కడే ఉన్న మరో పోలీసు కేశవ్ అని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు టి.హరీష్ రావు ఈ సంఘటనను ఖండించారు.. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అభివర్ణించారు. చేవెళ్లలో మరో ఘటన కలకలం రేపింది.. ఇద్దరు వ్యక్తులపై క్రూరంగా దాడి చేస్తూ ట్రాఫిక్ పోలీసులు కెమెరాలో చిక్కారు.. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు.. అధికార దుర్వినియోగం. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై వేగంగా, కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Next Story