Mon Dec 23 2024 01:04:29 GMT+0000 (Coordinated Universal Time)
అది తెలుగుదేశం ప్రయోజనాల కోసమే: రాములమ్మ ఆగ్రహం
విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై
విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని సంచలన ట్వీట్ వేశారు రాములమ్మ.
"ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని... తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణ ల బలపడనీకి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణ ల తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం..." అంటూ ట్వీట్ వేశారు విజయశాంతి.
Next Story