Tue Apr 01 2025 17:32:07 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు

సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఖర్గే విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ నుంచే...
గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కావడం లేదు. అప్పటి నుంచే కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ఆమె బీజేపీకి మొన్న బుధవారం రాజీనామా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
Next Story