Mon Dec 23 2024 08:50:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఊరంతా ఒకచోట చేరి పిడిగుద్దులతో...?
ఊరంతా ఒకచోట చేరారు. ప్రజలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పిిడిగుద్దులతో హోలీ పండగను జరుపుకున్నారు.
ఊరంతా ఒకచోట చేరారు. ప్రజలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పిిడిగుద్దులతో హోలీ పండగను జరుపుకున్నారు. సంప్రదాయంగా వచ్చే ఈ ఆచారాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. హోలీ పండగ రోజు ఊరంతా వీధుల్లోకి వచ్చి పిడిగుద్దులు గుద్దుకుంటారు. గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడమే ఈ వింత ఆచారం.
ఒకరి ముఖంపై మరొకరు...
హున్సా గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని హోలీ రోజు సాయంత్రం ఈ గుద్దులాటను నిర్వహించుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేస్తే గ్రామానికి మంచిదని పెద్దలు చెబుతుండటంతో ఈ జనరేషన్ కూడా దానిని కొనసాగిస్తున్నారు. అడ్డంగా తాడు కట్టి మరీ ఒకరి ముఖాలపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు పాటు సాగే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజలు మామూలుగా మారి వెళ్లిపోతారు.
Next Story