Mon Dec 23 2024 03:04:11 GMT+0000 (Coordinated Universal Time)
మహిళపై వీఆర్ఏ అత్యాచారయత్నం.. అడ్డొచ్చిన భర్తను..
అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు అశోక్. హోటల్ లో ఉన్న శ్రీనివాస్ భార్యపై అశోక్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా..
కొండాపూర్ : కామాంధులు లేని ఊరు, వాడ, వీధి లేదు. కన్ను మిన్ను కానకుండా కనిపించిన ఆడదానిపై కన్నేసి.. వారిపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వీఆర్ఏ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. అడ్డొచ్చిన భర్తపై దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ శివారులో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు అశోక్. హోటల్ లో ఉన్న శ్రీనివాస్ భార్యపై అశోక్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని భావించిన అశోక్.. గత రాత్రి ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో.. అవి విన్న భర్త అశోక్ ను అడ్డుకోబోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. కోపంలో అశోక్ శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. చేతివేలిని పోగొట్టుకుని తీవ్ర రక్తస్రావంతో రాయపర్తి పోలీసులను ఆశ్రయించాడు శ్రీనివాస్. జరిగిన ఘటనంతా పోలీసులకు వివరించి, వీఆర్ఏ అశోక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఆ దంపతులు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story