Mon Dec 23 2024 07:53:08 GMT+0000 (Coordinated Universal Time)
నా పేరుతో డబ్బులు అడగుతున్నారు నమ్మొద్దు : కలెక్టర్
అర్జెంటుగా డబ్బులు కావాలంటూ వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఫేస్బుక్ నుంచి మెసేజ్లు రావడంపై కలెక్టర్ స్పందించారు
తాను మీటింగ్లో ఉన్నా.. అర్జెంటుగా డబ్బులు కావాలంటూ వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఫేస్బుక్ నుంచి మెసేజ్లు రావడంపై కలెక్టర్ స్పందించారు. ఫేస్ బుక్ లో కొందరు నకిలీ ఖాతాలు సృష్టించి తన పేరిట డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ దీనిని నమ్మి వారు చెప్పిన నెంబరుకు డబ్బులు పంపవద్దని తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు...
ఈ మేరకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో పడవద్దని ఆమె కోరారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని కలెక్టర్ లావణ్య కోరారు. శ్రీలంక ఫోన్ నెంబరు తో ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Next Story