Thu Dec 19 2024 16:08:32 GMT+0000 (Coordinated Universal Time)
ఈ టీఆర్ఎస్ నేతకు ఈసీ నోటీసులు
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దసరా సందర్భంగా మద్యం, కోళ్లను పంపిణీ చేశారన్న కారణంగా ఆయనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. దీనిని పరిశీలించిన ఎన్నిక కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మద్యం, కోళ్లు పంపిణీ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కలెక్టర్ కు ఆదేశం...
దీనిపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని వరంగల్ కలెక్టర్ ను ఎన్నికల కమిషన్ కోరింది. మునుగోడు ఓటర్లకు మద్యంతో పాటు కోళ్లను పంచారని టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరిపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల కమిషన్ ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. ఎందుకు మద్యం, కోళ్లను పంపిణీ చేశారో చెప్పాలని నోటీసుల్లో కోరింది.
Next Story