Mon Dec 23 2024 12:18:45 GMT+0000 (Coordinated Universal Time)
Ponguleti : ఖరీదైన వాచ్ ల కొనుగోలు ఈడీ దాడులకు కారణమట
మంత్రి పొంగులేటి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీల్లో వాచ్ లు ప్రధాన పాత్ర పోషించాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీల్లో వాచ్ లు ప్రధాన పాత్ర పోషించాయి. కోట్లు వెచ్చించి వాచ్ లను కొనుగోలు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. వాచ్ ల స్మగ్లింగ్ పై మరో కేసు నమోదు చేసి ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు. మనీలాండరింగ్, ఫెమా చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
వంద కోట్ల విలువైన...
లగ్జరీ వాచ్ ల కొనుగోలు వ్యవహారంలోనే ఈడీ పొంగులేటి నివాసంలో సోదాలు నిర్వహించామని ఈడీ అధికారులు చెబుతున్నారు. పన్నులు చెల్లించకుండా వాచ్ లను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కేసుల్లోనే ఈ సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. గతంలోనే ఈడీ అధికారులు పొంగులేటి కుమారుడికి ఈ విషయంలో నోటీసులు ఇచ్చారు. ఖరీదైన వాచ్ ల స్మగ్లింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. ఇందుకు వంద కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సింగపూర్ నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు ఈ వాచ్ లు వచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
Next Story