Mon Dec 23 2024 14:11:25 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అకాల వర్షం.. పంట నష్టం
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి. అనేకచోట్ల వర్షం పడింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి. అనేకచోట్ల వర్షం పడింది. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈదురుగాలులతో...
అనేక చోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంటనష్టం జరిగిందని తెలిసింది. అనేక పశువులు మృతి చెందాయి. సిద్దిపేట, దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం అయి ఉంది. కొంత ఉపశమనం ప్రజలకు కలిగించినా పంటలు నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Next Story