Mon Dec 23 2024 10:13:23 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం
ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం జులై 31న ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం మధ్యలో కొనసాగుతూ సముద్రమట్టం నుండి 9.5 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు గాలులు బలంగా వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల మాత్రం భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.జులై 31 సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 01 మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు 2023 ఆగస్టు 01 మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Next Story