Tue Jan 14 2025 22:42:50 GMT+0000 (Coordinated Universal Time)
Vote : ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ? ఓటు కోసం 2కే రన్
హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ నేతృత్వంలో 2కే రన్ జరిగింది.
హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ నేతృత్వంలో 2కే రన్ జరిగింది. మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కూడా హాజరయ్యారు. ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శేర్లింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు 'ఐ ఓట్ ఫర్ షూర్' అనే నినాదంతో నిర్వహించిన 2కె రన్ ఉత్సాహంగా సాగింది.
ఒకే చోట ఓటు..
వివిధ వర్గాల వారు స్వచ్చందంగా 2కె రన్ లో పాల్గొన్నారు. అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ ,ట్రాన్స్ జెండర్లు,యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్స్, సైకిలిస్ట్ అసోసియేషన్స్, పోలీసులు, విద్యార్థిని విద్యార్థులు, పెద్ద ఎత్తున 2కె రన్ లో భాగస్వాములై విజయవంతం చేశారు. ఐ ఓట్ ఫర్ షూర్, ప్రకాశవంతమైన దేశం కోసం ఓటు వేయాలి అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల ప్రజలు 2కే రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్వేచ్ఛయుతంగా నైతిక ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో 3.30 కోట్ల ఓటర్లు ఉన్నారని, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనట్లైతే ఓటు వృధా అవుతుందన్నారు. ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒకచోట మాత్రమే ఓటు ఉండాలన్నారు.
బాధ్యత గల పౌరులుగా...
బాధ్యతగల పౌరులుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని,"సి"విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి పిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల లోపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2 కె రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోవారిని,చుట్టుపక్కల వారిని తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచాలన్నారు .హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ, బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పదని, మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, శేర్లింగంపల్లి పెద్ద నియోజక వర్గమని, ఏడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఆదాయం, చదువులో మాత్రమే కాదు, సామాజిక బాధ్యతలో కూడా ముందున్నామని నిరూపించు
కోవాలన్నారు.
Next Story