Mon Dec 23 2024 01:42:14 GMT+0000 (Coordinated Universal Time)
"కుమార్తెను కాపాడుకునేందుకు చీకటి ఒప్పందం"
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రూ.80 కోట్లు (25+25+30) ట్రాన్స్ ఫర్ చేసినట్లు సుఖేశ్ చెప్పాడు.
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కొద్దిరోజుల కిందట వినిపించిన సంగతి తెలిసిందే..! తాజాగా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు చేశాడు. కవితకు సంబంధించిన డిస్టిలింగ్ షెల్ అకౌంట్ల నుంచి మంత్రి కైలాస్ గెహ్లాట్ కజిన్కు చెందిన ‘గ్రీన్ హస్క్’ ఇండస్ట్రీస్ (మారిషస్)కు కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు తెలిపాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రూ.80 కోట్లు (25+25+30) ట్రాన్స్ ఫర్ చేసినట్లు సుఖేశ్ చెప్పాడు. ఈ డబ్బును యూఎస్ బీసీ, క్రిప్టో కరెన్సీకి మార్చిన అనంతరం కేజ్రీవాల్ సూచనల మేరకు అబుధాబికి పంపినట్లు పేర్కొన్నాడు.
అయితే కేసీఆర్ తన కుమార్తెను కాపాడుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. క్రిప్టో కరెన్సీ, హవాలా ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రూ.80 కోట్లు చెల్లించినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా కూడా కవితను అరెస్టు చేయడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె కవితను కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలోని లేని బీజేపీని ప్రత్యమ్నాయ ప్రతిపక్షంగా ప్రజలకు కేసీఆర్ చూపుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Next Story