Tue Nov 05 2024 14:47:42 GMT+0000 (Coordinated Universal Time)
కవితకు సడెన్ గా ఈడీ నోటీసులెందుకు?
ఇటీవల కాలంలో కొన్ని సర్వే ఏజెన్సీలు తేల్చిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 34, ఎలెక్షన్ వేవ్‌తో గెలిచే స్థానాలు 15 ప్రలోభాలతో గెలిచే స్థానాలు ఓ 6 ఉంటాయి.
ఇటీవల కాలంలో కొన్ని సర్వే ఏజెన్సీలు తేల్చిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 34, ఎలెక్షన్ వేవ్‌తో గెలిచే స్థానాలు 15 ప్రలోభాలతో గెలిచే స్థానాలు ఓ 6 ఉంటాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సర్వప్రయత్నాలు ఒడ్డి గెలవగలిగిన స్థానాలు 55 నుంచి 61. కాంగ్రెస్ వేవ్ పెరిగేకొద్దీ ఈ సంఖ్య తరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ 40 కంటే ఎక్కువ స్థానాలను సునాయసంగా గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే ఆ సంఖ్య తగ్గుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయానికి బిజేపి వెర్సస్ బీఆర్ఎస్ అనే నినాదం తీస్కుని రావాలని బిజేపి ప్రయత్నిస్తోంది. ఆ వేవ్ ఏమైనా రేగితే పైన పేర్కొమన్న సంఖ్యలో కాంగ్రెస్ మూడోవంతు స్థానాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. బిజేపి ప్రస్తుతం 13 నుంచి 18 స్థానాలను దక్కించుకుంటుంది సర్వేలు చెప్తున్నాయి. బిజేపి వెర్సస్ బీఆరెస్, హిందుత్వ రైజింగ్ వంటి పాయింట్లు కలిసివస్తే కాషాయ పార్టీకి అదనంగా మరో ఐదు స్థానాలు కలిసి వస్తాయి. కానీ బిజేపి పార్టీలో కూడా ప్రస్తుతం సందిగ్ధత, తగ్గిన జోష్ని చూస్తుంటే పదమూడు కూడా టఫ్ఫే అనిపిస్తుంది.
ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికలు అంతిమంగా బీఆర్ఎస్కే అనుకూలంగా ఉంటాయి అనిపిస్తోంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కార్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుంది. ప్రీపోల్ లేదా పోస్ట్ పోల్ అలయన్స్‌తో ప్రభుత్వాన్ని ఫామ్ కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిత్ర పార్టీలు ఎమ్ఐఎమ్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారే నేతలు కారుకి స్టెప్నీలుగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో వైరల్ గా మారిన బిజేపి, బీఆర్ఎస్లు రెండూ దోస్తులే అనే ప్రచారాన్ని.. ఆ రెండు పార్డీలూ తుడిపే ప్రయత్నం చేస్తున్నాయి. అవి రెండు ఒకవేళ నిజంగానే మిత్ర పక్షాలు అయితే రేపు #కల్వకుంట్ల కవిత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆమె అరెస్ట్‌తో వీక్ అవుతున్న బీఆర్ఎస్ మీద సింపతీ ఏర్పడవచ్చు. కవిత అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ పై సింపతీ పెరిగి కాంగ్రెస్ వేవ్ కాస్త వెనకబడుతుంది అని వాళ్ళ స్ట్రేటజీలో భాగం అయి ఉండవచ్చు.
ఆ అరెస్ట్‌తో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుస్తుందా అది అనుకుందామంటే.. ప్రస్తుతానికి అది కూడా ప్రశ్నార్థకమే!
- బిజేపి, బీఆరెస్‌లు మిత్ర పక్షాలు అయి ఉంటే.. కవిత అరెస్ట్‌తో పాటు, ఈనెల జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్‌ను పాస్ చేసి అందులో కొంత క్రెడిట్ కవితకు ఆపాదించే వైరల్ వార్తలు వెలువడతాయి. ఆమెను అరెస్ట్ చేసిన నెల రోజుల వ్యవధిలోపు విడుదల చేసి మరింత సెంటిమెంట్ ఏర్పడేలా ప్రణాళికలు చేపడతారు
Next Story