Mon Dec 23 2024 10:43:08 GMT+0000 (Coordinated Universal Time)
బావ ఫోన్తో ఆగిపోయిన మరదలి పెళ్లి.. నోటిదూల
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వధువుకు బయ్యారం మండల వరుడితో పెద్దలు సమక్ష్యంలో పెళ్లి..
మహబూబాబాద్ : మరో అగరంటలో పెళ్లి.. బంధువులంతా వచ్చి పెళ్లి పందిట్లో కూర్చున్నారు. పూజారీ మంత్రాలు చదువుతూ.. వధూవరులతో గౌరీ పూజ చేయిస్తున్నాడు. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. ఇక తాళి కట్టడం ఒక్కటే తరువాయి. అంతలోనే వధువుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వరుడు సైతం నాకు ఈ పెళ్లి వద్దంటే వద్దూ అంటూ పట్టుబట్టాడు. అసలు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వచ్చింది ? ఎక్కడి నుంచి వచ్చింది ? ఏం మాట్లాడారు ? అనేదేగా మీ సందేహం.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వధువుకు బయ్యారం మండల వరుడితో పెద్దలు సమక్ష్యంలో పెళ్లి నిశ్చయమైంది. కురవి మండలంలో పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబీలు అన్ని ఏర్పాట్లు చేశారు. తాళి కట్టే సమయంలో వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్ చేశాడు. హలో బాబాయ్ గారు.. నేను వధువు అక్క భర్తను మీరు ఎలా ఉన్నారు. కొంచం మా మరదలికి ఫోన్ ఇస్తారా.. కొంచెం మాట్లాడాలి అని కోరాడు. ఆ సమయంలో వధువు వరుడి ఇంట్లోనే ఉంది. అయితే వరుడి తండ్రి తనకు కాబోయే కోడలికి ఫోన్ ఇచ్చి మీ బావగారంట అమ్మా.. మాట్లాడమ్మా అని చెప్పి వెళ్లిపోయాడు. బావ మరదలితో ఫోన్ లో మాట్లాడుతూ.. నిన్న నీతో ఫొటో దిగకపోవడానికి కారణం ఏమిటో నీకు తెలుసా?.. నీపై నేను కోపంగా ఉన్నాను..! అంటూ తాను చెప్పాలనుకున్నవన్నీ ఫోన్ లో చెప్పేశాడు.
అయితే ఫోన్ లో మాట్లాడిన సంభాషణ అందరికీ ఎలా తెలిసింది ? ఎందుకు పెళ్లి ఆగిపోయిందనే సందేహం మనకు కలుగక మానదు. అయితే ఇప్పుడు ఫోన్ లలో చాలా మంది ఆటోమెటీక్ రికార్డింగ్ లను పెట్టుకుంటున్నారు. అదేవిధంగా వధువు కాబోయే మామ కూడా తన ఫోన్ లో ఆటోమేటిక్ రికార్డన్ ఆన్ చేసి ఉంది. ఈ విషయం బావతో పాటు వధువుకు కూడా తెలియదు. అయితే కొంతసేపటి తరువాత వరుడు తన తండ్రి ఫోన్ తీసుకుని.. బావా, మదరళ్ల మధ్య సాగిన సంభాషణ మొత్తం విన్నాడు. ఇరుపెద్దలు పిలిపించి ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు. ఇరువురిని కూర్చోబెట్టి కౌన్సిలింట్ ఇప్పించినా.. వరుడు అంగీరకించలేదు. దీంతో అతడికి నచ్చజెప్పి.. పెళ్లి జరిపించేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
Next Story