Sun Dec 22 2024 18:54:09 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు : కేటీఆర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెప్పారన్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్న కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలిపారు.
త్వరలోనే సుప్రీంకోర్టుకు...
ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించామన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారని చెప్పారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు.
Next Story