నాగార్జున సాగర్ దగ్గర బౌద్ధ వనం.. అతి త్వరలో ఓపెనింగ్
బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులు ఏర్పాటు చేశారు. మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను ..
నల్గొండ : తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ 'బుద్ధవనం' త్వరలో ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించనుంది ఈ పార్క్. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల నుండి బౌద్ధులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ పార్క్ స్థాపించబడింది. 274.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో కాటేజీలు, ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపాన్ని బుద్ధవనంలో నిర్మించారు. శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టేలా చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు. లుంబిని, సారనాథ్, బుద్ధగయ, కృషి నగర్ బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు.