Mon Dec 23 2024 00:25:02 GMT+0000 (Coordinated Universal Time)
అంబేద్కర్ ను అవమానిస్తూ పోస్ట్.. వ్యక్తి అరెస్ట్
ప్రసాద్ షేర్ చేసిన వీడియోలో తాను మాట్లాడుతూ..అంబేద్కర్ కనుక బతికి ఉంటే తాను ఆయనను..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన వ్యక్తికి తెలంగాణ పోలీసులు సంకెళ్లు వేశారు. నిందితుడు హమారా ప్రసాద్ గా గుర్తించారు. ప్రసాద్ షేర్ చేసిన వీడియోలో తాను మాట్లాడుతూ..అంబేద్కర్ కనుక బతికి ఉంటే తాను ఆయనను చంపేసి ఉండేవానని అన్నాడు. గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు తాను అంబేద్కర్ను హత్య చేసేవాడినని పేర్కొన్నాడు. అంబేద్కర్ రాసిన పుస్తకాన్ని పట్టుకుని చూపిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. హమారా ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Next Story