Mon Dec 23 2024 07:47:27 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిలకు వాసిరెడ్డి ప్రశ్నలు.. ఇవి
చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.
చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబుతో కలసి జగన్ పై షర్మిల కుట్రలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. షర్మిల ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయాలకోసం మీరు ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి దగ్గర కాంగ్రెస్ లిస్ట్ మీరు చదువుతుంటే చాలామంది హృదయాలు ముక్కలయ్యాయన్న షర్మిల కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ను అవినీతిపరుడుగా చిత్రించి కేసులు పెట్టిందన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ కు...
జగన్ ని జైలునుంచి బయటకు రాకూడదని ఉచ్చుపన్నిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టారు...ఎందుకు ఎత్తేశారని ఆమె ప్రశ్నించారు. ఎదురుదాడి చేయడం కాదని, ప్రజలకు షర్మిల సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిలకు కోర్టులపైన, వ్యవస్ధలపైన నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి హత్య పై ఎలా మాట్లాడతారన్నారు. హంతకుడు అని అవినాష్ పై ఎలా నిందలు వేస్తున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్ది అవినాష్ గురించి హంతకుడు అని ప్రచారం చేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.
Next Story