Mon Dec 23 2024 08:09:42 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. నేడు, రేపు వర్షాలు !
నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ..
హైదరాబాద్ : మండుటెండలతో అల్లాడిపోతున్న తెలంగాణవాసులకు ఐఎండీ చల్లటివార్త చెప్పింది. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ అంచనా ప్రకారం నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చని తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవచ్చని ఐఎండీ హెచ్చరించింది. మే 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
నిన్న వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని చేవెళ్ల, మొయినాబాద్, తెల్లాపూర్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలోని కుంతలలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Next Story