Wed Jan 15 2025 10:19:32 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రి జిమ్ కి వెళ్లొచ్చాడు.. వాకింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి
తాజాగా మరో యువకుడు గుండెపోటుతో తనువు చాలించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. స్థానిక రామయ్యబౌలికి చెందిన..
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు చిన్న, పెద్ద ఎవరూ అతీతం కాదు. స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి.. వృద్ధుల వరకూ ఎవరిని ఏ క్షణంలో గుండెపోటు రూపంలో మృత్యువు కబళిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఆకస్మిక గుండెపోటు మరణాలకు పోస్ట్ కోవిడ్ లక్షణాలు కొంత కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ తినే ఆహారంలో సోడియం (ఉప్పు) మోతాదును అధికంగా తీసుకోవడం కూడా గుండెపోటుకు కారణం అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
తాజాగా మరో యువకుడు గుండెపోటుతో తనువు చాలించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. స్థానిక రామయ్యబౌలికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ అలియాస్ జున్ను (23) రోజులానే గురువారం రాత్రి జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. 11 గంటల సమయంలో అతనికి చాతీలో నొప్పిగా ఉందంటూనే వాంతులు చేసుకున్నాడు. అయితే దానిని గుండెపోటుకు సంకేతంగా భావించలేదు. అనంతరం ఇంటిముందు వాకింగ్ చేస్తూ.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే జున్ను మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు.
Next Story