Mon Dec 23 2024 00:49:58 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందారు.యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించింది
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందారు.యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
ఉన్నత చదువుల కోసం...
సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. సౌమ్య మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదువుకోవడానికి వెళ్లి అమెరికాలో మరణించడంతో సౌమ్యం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Next Story