Sun Dec 22 2024 19:45:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా విచారణ
వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నేడు కూడా కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు విచారణ జరుగుతుంది
వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ నేడు కూడా కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు విచారణ జరుగుతుంది. నిన్న అవినాష్ రెడ్డిని దాదాపు ఎనిమిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్యానంతరం జరిగిన విషయాలపైనే ఎక్కువగా వివేకానందరెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఆధారాలు చెరిపేయటం దగ్గర నుంచి అక్కడ వివేకా తలకు బ్యాండేజీ కట్టడం వరకూ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈరోజు మరోసారి సీీబీఐ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు.
హత్యకేసులో...
నిన్న ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తూనే మరోవైపు అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించారని సమాచారం. అయితే ముగ్గురిని ఒకే సారి విచారిస్తారని అనుకున్నా వేర్వేరుగానే విచారించినట్లు చెబుతున్నారు. ఈరోజు కూడా ముగ్గురి విచారణ జరగనుంది.
Next Story