Fri Dec 20 2024 11:30:52 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ నుండి రాగానే షర్మిల చెప్పిన మాట ఇదే
కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది
వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరికపై మీడియా ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. ఆమెను భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన విషయంపై మీడియా ప్రశ్నించగా.. అందుకు షర్మిల 'చూద్దాం..' అంటూ చెప్పి ముందుకు కదిలారు. పార్టీ విలీనం గురించి మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉంటే నవ్వుతూ వెళ్లిపోయారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ వెళ్లిపోయారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ.. షర్మిల తనకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కలిశారని, కొద్దిసేపు మాట్లాడానని తెలిపారు. ఇద్దరం ఒకే విమానంలో హైదరాబాద్‌కు వచ్చామని చెప్పారు. ఢిల్లీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిలను తాను ఆహ్వానిస్తున్నానని, ఆమె వల్ల 4 ఓట్లు వచ్చినా 400 ఓట్లు వచ్చినా మాకు ప్రయోజనమేనని చెప్పారు. పార్టీ నాయకత్వం కూడా అందర్ని కలుపుకొని పోవాలన్నారు. షర్మిలను చేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ వేరుకాదని, రాజశేఖర్‌రెడ్డి తమ నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్ ఆస్తి... వైఎస్ కు తెలంగాణలోనే ఎక్కువ మంది అభిమానులున్నారన్నారు.
Next Story