Fri Mar 21 2025 17:45:05 GMT+0000 (Coordinated Universal Time)
కవితపై షర్మిల ఫైర్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో మహిళ రిజర్వేషన్ల అమలు కోసం దీక్షకు దిగిన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో మహిళ రిజర్వేషన్ల అమలు కోసం దీక్షకు దిగిన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ లోనే మహిళ రిజర్వేషన్ లేదన్నారు. గవర్నర్ కు అవమానం జరిగినప్పుడు కవిత ఎందుకు స్పందించలేదంటూ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని కేసీఆర్ ఎదుట అంటూ ఆమె సెటైర్ వేశారు.
గవర్నర్ కు అవమానం జరిగితే...
తెలంగాణలో మహిళలకు జరుగుతున్న అవమానాలను పట్టించుకోని కవిత దేశంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ దీక్షకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తొలుత తన సొంత రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించాలని తన తండ్రి కేసీఆర్ పై పోరాటం చేయాలంటూ షర్మిల అన్నారు.
Next Story