Mon Dec 23 2024 05:38:45 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పాలేరు నుంచే షర్మిల పోటీ
పాలేరు నుంచే వైఎస్ షర్మిల పోటీ చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
పాలేరు నుంచే వైఎస్ షర్మిల పోటీ చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబరు 4వ తేదీన షర్మిల నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని వైెఎస్ షర్మిల నిర్ణయించారు. ఇటీవల నెలకొన్న కొన్ని సందేహాలకు ఆమె తెరదించారు. పాలేరు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
హేమాహేమీలు...
పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినా ఆమె పాలేరు నుంచే పోటీ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగనుంది. షర్మిల ప్రచారం ప్రారంభమైన తర్వాత మరింత వేడి పెరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్పార్టీపీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. దీంతో పాలేరులో పోటీ మామూలుగా ఉండేటట్లు కనపడటం లేదు.
Next Story