Mon Dec 23 2024 02:58:08 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా-రాహుల్ గాంధీలను కలిశాను: వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో కలుసుకున్నారు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని అందరితో చెపుతున్నానని అన్నారు. మీడియా ప్రశ్నలు అడుగుతూ ఉంటే తర్వాత మాట్లాడదామని, తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఆమె వారిని కలిశారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని చెప్పారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Next Story