Fri Mar 14 2025 07:14:46 GMT+0000 (Coordinated Universal Time)
పాలేరులో నేడు భూమిపూజ
నేడు పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి వైఎస్ షర్మిల భూమి పూజ చేయనున్నారు

నేడు పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి వైఎస్ షర్మిల భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు భూమి పూజలో షర్మిల పాల్గొంటారు. పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించిన నేపథ్యంలో పాలేరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అక్కడి నుంచే పోటీ ...
ఈరోజు మరోసారి తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించనున్నారు. ఇప్పటికే పాలేరులో వైఎస్ షర్మిల గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. కీలకమైన నేతలను నియమించుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈరోజు జరిగే భూమి పూజ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ కూడా పాల్గొననున్నారు.
Next Story