Mon Dec 23 2024 09:56:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మెదక్ జిల్లాకు షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవ హవేలీ ఘనపూర్ మండలంలోని భూపతి గ్రామంలో కరణం రవి అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పంటలకు గిట్టు బాటు ధర లభించడం లేదని, పంటను కొనుగోలు చేయడం లేదని, అప్పులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైతు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.
తిరిగి పాదయాత్ర....
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఈరోజు మెదక్ జిల్లాకు వెళ్లనున్నారు. రైతు కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ దృష్ట్యా షర్మిల పాదయాత్రను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తి కానుండటంతో తిరిగి పాదయాత్రను షర్మిల ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- ys sharmila
- medak
Next Story