Sat Dec 28 2024 06:06:05 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి మళ్లీ పాదయాత్ర
వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానుంది
వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె రేపటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ లభించింది. ఈరోజు ముఖ్యనేతలతో ఆమె సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాలు కూడా కొన్ని ప్రకటించే అవకాశాలున్నాయని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.
నర్సంపేట నుంచి....
దీంతోపాటు ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే యాత్రను మొదలుపెట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. నర్సంపేట నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు చెప్పాయి. తమ వాహనాలకు నిప్పుపెట్టిన వారిని అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు నిచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీడియాతో మాట్లాడేందుకు కూడా షర్మిల రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
Next Story