Sun Dec 14 2025 23:20:00 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్యకేసుపై హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలని హైకోర్టులో వైఎస్ సునీత పిటీషన్ వేశారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలని హైకోర్టులో వైఎస్ సునీత పిటీషన్ వేశారు. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదన్నారు. కోర్టులో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని పిటిషషన్లో కోరారు.
త్వరగా ట్రయల్ పూర్తయ్యేలా...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు ట్రయల్ ప్రాథమిక దశలోనే ఉందని పిటిషన్లో వైఎస్ సునీత పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన డిస్కుల్లో పదమూడు లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారని వైఎస్ సునీత పిటీషన్ లో పేర్కొన్నారు. సాక్షులు వరుసగా చనిపోతున్నారని గుర్తు చేశారు.
Next Story

