Fri Dec 27 2024 02:42:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వరంగల్ కు షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఆమె పాదయాత్ర వరంగల్ నగరం మీదుగా కొనసాగనుంది
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఆమె పాదయాత్ర వరంగల్ నగరం మీదుగా కొనసాగనుంది. బట్టల బజార్, ములుగు రోడ్డు, హనుమకొండ చౌరస్తా, పబ్లిక్ గార్డెన్ వరకూ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
అందరితో కలసి...
ఈ పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల పలువురితో కలసి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు నిలల విరామం అనంతరం నర్సన్నపేట నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర వరంగల్ కు చేరుకోనుంది. బీఆర్ఎస్ పాలనపై షర్మిల విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పోలీసులు షర్మిల పాదయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story