Fri Dec 20 2024 08:26:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ప్రాజెక్టులు కుక్క తోక తగిలితే కూలిపోయేలా
తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూలేపోయే పరిస్థితి ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూలేపోయే పరిస్థితి ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కుక్కతోక తగిలితేనే ప్రాజెక్టులు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్న ఆమె కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దానికి రీ డిజైన్ చేశారన్నారు. కేసీఆర్ తనకు తాను అపర మేధావిలాగా ఫీల్ అవుతారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరం అయినా కమిషన్ ల కోసం రూపకల్పన చేశారన్నారు.
తోడు దొంగలు...
నలభై వేల కోట్ల ప్రాజెక్టును లక్షా ఇరవై వేలకు పెంచారని, ఇలా అవినీతికి పాల్పడిన ప్రాజెక్టు నేడు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని షర్మిల ఆవేదన చెందారు. తాము సీబీఐకి కూడా ఫిర్యాదు చేశామన్న షర్మిల కాపలా కుక్కలాగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీజీేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ తోడుదొంగలు అని ఆమె అన్నారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం బహిరంగంగా మద్దతిస్తుంటే బీజేపీ ఏం చేస్తుందని షర్మిల రెడ్డి నిలదీశారు. కేసీఆర్ ను బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. తెలంగాణ దొంగలకు ఓటు వేయవద్దని ఆమె కోరారు.
Next Story