Mon Dec 23 2024 08:25:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైఎస్ షర్మిల దీక్ష
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నిరాహార దీక్ష చేయనున్నారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నిరాహార దీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఆమె యాత్ర 158వ రోజుకు చేరుకుంది.
నిరుద్యోగులకు మద్దతు...
ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు నిరుద్యోగుల కోసం కొండుర్గ్ మండల కేంద్రంలో ఈ దీక్షను వైఎస్ షర్మిల చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ షర్మిల ఈ దీక్ష చేయనున్నారు. అనంతరం లాల్ పహాడ్ గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.
Next Story