Tue Nov 26 2024 05:30:16 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ కు అండగా షర్మిల
మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పై తీన్మార్ మల్లన్న చేసిన పోల్ నిర్వహించడంపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు అండగా షర్మిల నిలిచారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల చేసిన వ్యాఖ్యలను ఎవరైనా ఖండించాల్సిందేనని షర్మిల అన్నారు.
పోలీసు కేసు నమోదు....
కాగా తీన్మార్ మల్లన కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పై చేసిన వ్యాఖ్యలపై పోలీసు కేసు నమోదయింది. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు.
- Tags
- ys sharmila
- ktr
Next Story