Mon Dec 23 2024 11:42:48 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ సీబీఐ ఆఫీసుకు వైఎస్ షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె సీబీఐ అధికారులను కలిశారు
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె ఢిల్లీలో సీబీఐ అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 1.20 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు సాక్ష్యమని పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతిపై...
చిన్న కాంట్రాక్టుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకూ ఒకే సంస్థకు అప్పగించారని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతిలో భాగంగానే ఒక్కరికే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. ఒక్కప్పుడు స్కూటర్ కూడా లేని కేసీీఆర్ నేడు సొంతంగా విమానం కొనుగోలు చేసే స్థాయికి ఎలా ఎదిగాడని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ధనదాహానికి అంతులేకుండా పోయిందన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సీీబీఐ డీఐజీ స్థాయి అధికారితో కేసీఆర్ అవినీతిపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
Next Story