Sun Dec 22 2024 23:57:34 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల ఆకస్మిక ధర్నా
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ధర్మాకు దిగారు. లక్కవరంలోని వైఎస్ విగ్రహం వద్ద షర్మిల ధర్నాకు దిగారు
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ధర్మాకు దిగారు. లక్కవరంలోని వైఎస్ విగ్రహం వద్ద షర్మిల ధర్నాకు దిగారు. ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని లక్కవరం గ్రామంలో వైఎస్ షర్మిల వచ్చారు. ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా దీక్ష చేశారు. షర్మిల నిరుద్యోగ దీక్ష 31వ వారానికి చేరుకుంది.
దాడికి నిరసనగా....
అయితే ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. దీక్ష ముగించిన షర్మిల ఈ విషయం తెలిసి వెంటనే లక్కవరంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నాచేప్టారు. ప్రశ్నించే దళిత నాయకుడిపై దాడులు చేస్తారా? అని షర్మిల మండి పడ్డారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేదిలేదని, దమ్ముంటే సమస్యలను పరిష్కరించాలని షర్మిల ఎమ్మెల్యేలకు సూచించారు. వైఎస్సార్ సైన్యం కదిలిదే ఇంచు కూడా కదలలేవని షర్మిల ఎమ్మెల్యే సైదిరెడ్డికి సవాల్ విసిరారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమండ్ చేస్తున్నారు.
Next Story